చిత్రం చెప్పేవిశేషాలు
(11-01-2025)
రాజస్థాన్‌లోని బీకానేర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఒంటెల ఉత్సవంలో తలపాగాల కళాకారుడు పవన్‌వ్యాస్ (కుడివైపు ఉన్న వ్యక్తి) ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా ఇలా భారీ తలపాగా చుట్టారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం ఘనంగా జరిగింది.
కోనసీమ అంటే గుర్తుకొచ్చేది కేరళ రాష్ట్రాన్ని తలపించే కొబ్బరి తోటలే. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి కొత్తకాలువ రహదారిలో కనిపించిన దృశ్యమిది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న ‘నుమాయిష్’కు శుక్రవారం సందర్శకులు పోటెత్తారు. టాయ్ ట్రైన్‌లో తిరిగి స్టాళ్లను చూశారు.
యాదగిరిగుట్ట దేవాలయానికి తరలివచ్చిన భక్తజనం.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బహుళ పొరల దుస్తులివి. వీటిని ‘హిమ్‌కవచ్’ దుస్తుల వ్యవస్థగా పిలుస్తున్నారు.
నక్కపల్లిలో శుక్రవారం విక్రయానికి తెచ్చిన జామకాయలు చూపరులను ఆశ్చర్యపరిచాయి. ఇవి భారీ సైజులో ఉండటమే ఇందుకు కారణం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నేపథ్యంలో శుక్రవారం శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీ సాధువుల చవనీ ప్రవేశ్ కార్యక్రమం సందర్భంగా ఆకట్టుకున్న హనుమంతుడి వేషధారులు, ఇతర కళాకారుల ప్రదర్శన
స్థానిక హోలీ వర్డ్స్ పాఠశాలలో శుక్రవారం ప్రపంచ హిందీ దివస్ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ ఎస్తేరు జయశ్రీఇమ్మానేయేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందీ ఆకృతిలో విద్యార్థులు కూర్చొని ప్రదర్శన చేశారు.
మహారాష్ట్ర కొల్లాపూర్‌లో జరిగిన హల్దీ ఫెస్టివల్‌లో తీసిన చిత్రం .
శిల్పారామంలో శుక్రవారం సాయంత్రం కళాకారులు చూడముచ్చటైన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.