చిత్రం చెప్పే విశేషాలు
(11-02-2025)
కొత్తగూడెం : ఎవరో ఉత్తరాది ప్రాంతవాసి చక్కగా తలపాగా ధరించి, తేనీటి రుచిని ఆస్వాదించాలని ఆహ్వానం పలుకుతున్నట్టు ఈ చిత్రం ఉంది కదూ..!
ఎండాకాలం వచ్చేసింది.. చల్లని నీటికి వెతుకులాట మొదలైంది. ఫ్రిజ్‌లో పెట్టిన ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడంకన్నా మట్టికుండలో పోసినవి తాగితే ఆరోగ్యానికి మంచిది. బయటకు వెళ్లినప్పుడు కుండలను మోసుకెళ్లలేం.
జూబ్లీహిల్స్ రోడ్డు 10లోని ప్లే ఆండ్ లెర్న్ పార్కు ఇది. పెద్దలైనా.. చిన్నారులైనా.. లూడో, చదరంగం, వైకుంఠపాళి ఆడుకునేలా చిత్రాలు గీశారు.
అవసరం అనేక ఆలోచనలు రేకెత్తేలా స్తుందనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సందర్శకులకు రాగిజావ అందిస్తూ కనిపించారు. తన ఆలోచనకు అనుగుణంగా తయారు చేయించుకున్న వాహనాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.
త్రివేణీసంగమం పరిసరాలను తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్
పరీక్షా పే చర్చ సందర్భంగా దిల్లీలోని సుందరవనంలో విద్యార్థులకు సూచనలు చేస్తున్న ప్రధాని మోదీ .
అలంకార ప్రియుడైన ఆ శ్రీనివాసుడు ఆహార పదార్థాల్లో తన రూపాన్ని ప్రదర్శించి కనువిందు చేశాడు.. దుళ్లలో కూటోత్సవంలో ఆహార పదార్థాలతో రూపొందిన శ్రీవారి అలంకరణ .
మహా కుంభమేళా సందర్భంగా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమానికి పోటెత్తిన భక్తులు.
ఎర్రని టమాటాలతో గుడిమల్కాపూర్ మార్కెట్ కళకళలాడుతోంది. నగర పరిసర జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి రైతులు తమ పంటను క్రయానికి తీసుకొస్తుండడంతో మార్కెట్ నిండిపోయింది. వ్యాపారుల కొనుగోళ్లతో సందడిగా మారింది.
చీడికాడ- కోనాం మార్గంలో జనుము తోట కన్నువిందు చేస్తోంది. కన్నుచూపు మేర జనుము పూలు కనిపించడంతో ప్రకృతి ప్రేమికులు ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు.