చిత్రం చెప్పే విశేషాలు
(11-03-2025)
కడప నగరంలో సోమవారం ప్రముఖ సినీనటి కీర్తిసురేష్ సందడి చేశారు.తనకు కడప కారం దోశ అంటే చాలా ఇష్టమని చెప్పడంతో ప్రేక్షకులు ఈలలు, కేకలు వేశారు.
కరాస: పైడిమాంబ అమ్మవారి తొలేళ్ల వేడుక సోమవారం ఘనంగా నిర్వహించారు.
అభిమానం.. నేలపై రూపమై.. ఛాంపియన్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ గుడుపల్లె మండలం పెద్దపర్తికుంటకు చెందిన పురుషోత్తం నేలపై గీసిన క్రికెటర్ల చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
పెద్దాపురం: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు గ్రహీత తాళాబత్తుల సాయి భారత్ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రాక్టర్ల రవాణా నేపథ్యంలో గూడ్స్ రైలు సోమవారం ఉదయం శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌కు చేరింది. కనుచూపు మేర 30 కోచ్‌ల్లో 200కు పైగా ట్రాక్టర్లు ఉండటం ఆకట్టుకుంది.
రంజాన్ మాసం కావడంతో చార్మినార్ పరిసరాలు వెలుగులతో నిండిపోయాయి. పండగ కొనుగోళ్లతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. రాత్‌బజార్ విద్యుద్దీపాలతో జిగేల్‌మంటోంది.
చినగంజాం మండలం పెదగంజాం పురాతన ఆలయంలోని శ్రీభావనారాయణ స్వామిని భానుడు లేలేత కిరణాలు సోమవారం తాకాయి.
‘కృష్ణమ్మ చెంత కాలుష్య ధార’ శీర్షికన ఈ నెల 9న ‘ఈనాడు’ పత్రికలో ప్రచురితమైన కథనానికి విజయవాడ కార్పొరేషన్ అధికారులతో పాటు దుర్గగుడి సిబ్బంది స్పందించారు.