#eenadu

అంబాజీపేట ప్రధాన రహదారి చెంతన ఉన్న ఓ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు వేసిన పందిరి అందరినీ ఆకట్టుకుంటోంది.  

150 తేనెపట్టులతో ఆకట్టుకుంటున్న ఈ చెట్టు కర్ణాటకలోని మైసూరు నడిబొడ్డున ఉంది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో సోథిబే సంస్థ నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఉంచిన  షాజహాన్‌ ఖడ్గమిది. అంతరచిత్రంలో ఖడ్గంపై చెక్కిన అక్షరాలు 

పర్యావరణ హితాన్ని ఆకాంక్షించే ఈ నినాదాలను హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన డ్రైవర్‌ ప్రదీప్‌ తన ఆటోపై రాశారు.

గురువారం కురిసిన వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మైసంపల్లిలో ఇలా వడగళ్లు ఒకదానిపై మరొకటి చేరి ముద్దగా తయారయ్యాయి.

ఈ చిత్రంలో ఒకే దుప్పికి రెండు శరీరాలు ఉన్నట్లు కనిపిస్తుంది కదా.. నిజానికి ఇక్కడ రెండు దుప్పులున్నాయి. హైదరాబాద్‌ ఆటోనగర్‌లోని మహావీర్‌ హరిణ వనస్థలి జాతీయ పార్కులోని చిత్రమిది.  

ఛత్తీస్‌గఢ్‌లోని గెర్వాలో భారత్‌లో అతిపెద్దది, ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన బొగ్గు గనిని గురువారం పరిశీలిస్తున్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 

 శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు.

చెక్కుచెదరని కళ... విశాఖపట్నం కలెక్టరు కార్యాలయం రాచఠీవితో ఆకట్టుకుంటున్న ఈ భవనం వయస్సు 103 ఏళ్లు. ఇప్పటికీ చెక్కుచెదరక నేటి తరం నిర్మాణదారులకు చక్కటి పాఠంగా నిలుస్తోంది. 

 ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరగనుంది. కాంతులీనుతున్న ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయం.

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(11-04-2025)

Eenadu.net Home