చిత్రం చెప్పేవిశేషాలు
(11-12-2024)
విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.
సంధ్య వేళ భానుడు మిలమిల మెరుస్తూ కాంతులీనాడు. విజయనగరం నగరపాలిక పరిధిలోని ట్యాంకుబండ్ సమీపంలో మంగళవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. చూపరులను ఆకట్టుకుంది.
ఇచ్ఛాపురంలో గణిత అంశాలతో తీర్చిదిద్దిన రంగవల్లిక.
తోడేలులా కనిపిస్తున్న ఈ శునకం సైబీరియన్ జాతికి చెందింది. దీని శరీరంపై ఉన్న దట్టమైన జుట్టుతో చలిని సైతం తట్టుకుంటుంది. మంగళవారం సీతాఫల్‌మండిలో యజమానితో కలిసి వాకింగ్‌కు బయలుదేరింది.
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కొండచుట్టూ అయ్యప్పస్వామి దీక్ష చేపట్టిన భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం బుధవారం భారీ ఎత్తున జరిగింది.
మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.
ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ హాజరైయ్యారు.
బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో 119వ శాఖను ఏర్పాటుచేసింది. నూతన బ్రాంచ్‌ను మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. బ్రాంచ్ సిబ్బందికి, సంస్థలో భాగస్వాములైన చందాదారులకు శుభాకాంక్షలు చెప్పారు.
మా గ్రాండ్‌ఫాదర్ రాజ్‌కపూర్ శత జయంతి వేళ ప్రధాని మమ్మల్ని ఆహ్వానించడం గౌరవంగా ఉంది. మోదీ జీ మీకు కృతజ్ఞతలు అంటూ కరీనా కపూర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.