చిత్రం చెప్పే విశేషాలు

(12-02-2025)

రామన్నపేట : శిశిర నవరాత్రుల్లో భాగంగా ఎంజీఎం కూడలిలోని శ్రీరాజరాజేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారిని మంగళవారం 2.40 లక్షల గాజులతో అలంకరించారు. 

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌కు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. 

న్యూశాయంపేట : జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు విజ్ఞాన, విహార యాత్రలకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అందులో జిల్లా కేంద్రం హంటర్‌ రోడ్డులోని సైన్స్‌ సెంటర్‌ను సందర్శిస్తున్నారు.  

నాయుడుపేట వద్ద జాతీయ రహదారిలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను ఆకట్టుకుంది. ఓ డ్రైవర్‌ లారీని ఆపగా దానిపై 30 అడుగుల భారీ విగ్రహం ఊరేగుతున్నట్లుగా చూపరులను కనువిందు చేసింది. 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ  లైఫ్‌ సైన్సెస్‌ ఆడిటోరియం ప్రాంగణంలో ‘థింకర్స్‌ డికోడ్‌ నేచర్స్‌ సీక్రెట్‌’ వ్యాఖ్యతో ఏర్పాటుచేసిన విగ్రహం వివిధ సెమినార్లకు వచ్చే ప్రతినిధులను ఆలోచింపచేస్తోంది.

గూడెంకొత్తవీధి: కొప్పులో ఒదిగిపోయే గులాబీని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అదే బుర్రంత పరిమాణంలో ఉంటే ఔరా అనిపించక మానదు.

అరకులోయ: రోడ్డు మార్గంలో వెళ్తున్న సందర్శకులకు రైల్వే పనులు ఎంతో ఆసక్తిగా కనిపిస్తున్నాయి. సుంకరమెట్ట నుంచి టైడా మార్గంలో ప్రకృతి అందాలతోపాటు రైల్వే అభివృద్ధి పనులు కనువిందు చేస్తున్నాయి.  

రామసముద్రంలోని చంద్రశేఖరస్వామి ఆలయ సౌందర్యం ఉషోదయ వేళల్లో అందరినీ అబ్బురపరుస్తోంది. అందమైన ఆలయం పుష్కరిణిలో అద్దంలా మారిన అపురూప దృశ్యం మీరూ చూడండి. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా ముస్తాబవుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం పున్నమి కాంతుల్లో మరింత తేజోమయంగా దర్శనమిచ్చింది.

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home