చిత్రం చెప్పే విశేషాలు
(12-03-2025)
పద్మనాభం క్షేత్రంలోని శ్రీఅనంత పద్మనాభస్వామి వారి కొండపైకి నిర్మించిన తారు రోడ్డు నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. దాదాపు పన్నెండు మలుపులతో ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం మంచి అనుభూతిని కలిగిస్తోంది. డ్రోన్‌తో తీసిన అనంతుని ఘాట్ రోడ్డు చిత్రాలు అబ్బుర పరుస్తున్నాయి.
బర్కత్‌పుర: జర్రున జాలువారే నీళ్లు.. ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పక్షులు.. చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంది కదూ.. పార్కులో వాటర్ ఫౌంటెయిన్‌లో నీరు పారుతుండగా.. దానిపై ఏర్పాటు చేసిన ఆకుపచ్చ కొంగల బొమ్మలు నిజమైన వాటిలా ఆకట్టుకుంటున్నాయి.
విశాఖపట్నం పోర్టు పరిధిలోని వంతెన విద్యుద్దీపాల వెలుగుల్లో ధగధగలాడిపోతోంది. జ్ఞానాపురం కూడలి ప్రాంతంలో వంతెనపై, స్తంభాలకు నూతనంగా మరికొన్ని దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళ మెరిసిపోతోంది. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.
గత అయిదేళ్లు వాటిని పట్టించుకోకపోవడంతో దుమ్ముకొట్టుకుపోయి కళా విహీనంగా కనిపించేవి. ఎట్టకేలకు వాటిని శుభ్రం చేసి.. కొత్త కళ తీసుకువచ్చారు.
లంక ప్రాంతాల్లో జింకలు చెంగు చెంగున పరిగెడుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పేరవరం, వెలిచేరు, రావులపాలెం తదితర ప్రాంతాల్లో తరచూ ఇవి కనిపిస్తున్నాయి.
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ‘ప్రసాద్’ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
కాట్రేనికోన: పల్లెటూరిలోని ఓ చిన్న ఇల్లు.. అందులో తల్లీకుమార్తెలు.. తన కూతురుకు పోలీసు టోపీ పెట్టి మురిసి పోతున్న మాతృమూర్తి. ఈ దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీంచారు.
భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న సీతారాముల వారికి మహా పట్టాభిషేకం ఉంటుంది.