#eenadu

ఆదిలాబాద్: మునగకాయలు ఒకటి, ఒకటిన్నర అడుగులు ఉంటేనే అబ్బా...! ఎంత పొడవున్నాయో అనుకుంటారు. ఏకంగా 4 అడుగులకుపైగా పొడవుగా కాస్తున్నాయి.

#eenadu

నిజామాబాద్‌: నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నది మధ్యలో రాళ్ల వద్ద కొంత భూమి ఇలా కోతకు గురై భారతదేశ పటం మాదిరిగా కనిపిస్తోంది.

కాకినాడలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు డ్రోన్లు వాడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. డ్రోన్‌ ద్వారా తీసిన నగర చిత్రమిది. 

 క్రియేటివ్‌ ఆర్ట్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సంస్థ అధ్యక్షుడు ఆకొండి అంజి ఇటీవల కాట్రేనికోనలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ గ్యాలరీలోని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. 

శ్రీపద్మావతీ అమ్మవారు శుక్రవారం సాయంత్రం తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం ఐపీఎల్‌ ఆటగాళ్లతో సందడిగా మారింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుండడంతో శుక్రవారం ఇరుజట్ల క్రీడాకారులు ముమ్మర సాధన చేశారు.  

 కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని తెప్పోత్సవం స్థానిక గౌతమి గోదావరిలో హంస వాహనంపై శుక్రవారం కనుల పండువగా జరిగింది.  

ఒంటిమిట్టలో భక్తజనంతో కళకళలాడుతున్న కల్యాణ వేదిక ప్రాంగణం, విద్యుత్తు కాంతులు దేదీప్యమాన ప్రభతో ప్రకాశించింది. 

చిక్కబళ్లాపుర: పర్యావరణ పర్యాటక వేదిక.. నందికొండకు తీగమార్గ ప్రయాణాన్ని సులువు చేయడానికి సర్కారు అనుమతి సాధించింది. పర్యాటక సంభ్రమ వేదికగా గిరిధామం విరాజిల్లనుంది .

హైదరాబాద్‌ - నాగార్జున సాగర్‌ రహదారిపై ఇబ్రహీంపట్నం చెరువుకట్ట దిగువన పచ్చదనం పరుచుకుంది. మండుటెండల్లోనూ 2 కి.మీ. పొడవునా చల్లగా ఉంటుంది. సొరంగాన్ని తలపిస్తూ ఆకట్టుకుంటోంది. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(11-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(11-04-2025)

Eenadu.net Home