#eenadu

నరసాపురం గ్రామీణ: ఎల్బీచర్లలోని గంగాలమ్మ ఆదివారం భక్తులకు ప్రత్యేకాలంకరణలో దర్శనమిచ్చారు. తీర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 

వేలేరుపాడు : మండు వేసవిలోనూ గోదారి అందాలు కనువిందు చేస్తున్నాయి. వీటిని చూస్తూ పరీవాహక ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు మంత్ర ముగ్ధులవుతున్నారు.

బుద్ధవనంలోని అశోకుడి మహాచక్రం వద్ద విద్యుద్దీపాల వెలుగులు

మధిర పట్టణం: ఈ చిత్రాలను చూస్తే అచ్చం సెల్‌ఫోన్లా కనిపిస్తున్నాయి కదూ. కానీ అది సెల్‌ఫోన్‌లాంటి పెళ్లి పత్రిక.

తుర్కాపల్లి గ్రామంలో భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆలయం చుట్టూ బండ్ల ప్రదర్శన నిర్వహించారు. 

#eenadu

ఇనుప వ్యర్థాలకో అర్థం ఇస్తూ విజయవాడకు చెందిన ప్రముఖ కళాకారుడు శ్రీనివాస్‌ పడకండ్ల తయారు చేసిన ‘జైహింద్‌ చక్ర’ శిల్పం దేశ రాజధాని దిల్లీలో కొలువుదీరింది. 

#eenadu

 గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం (శివాలయం) ప్రాంగణంలో భారతదేశ పటం, సూర్యయంత్రంతో సూర్యభగవానుడికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

#eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home