చిత్రం చెప్పేవిశేషాలు
(12-12-2024)
నటి కీర్తి సురేశ్ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ నటి మెడలో మూడుముళ్లు వేశారు. గోవాలో ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది.
వంపు తిరిగిన నారింజ రంగు ముక్కు.. గులాబీ రంగు కాళ్లు.. తెల్లటి రెక్కల చివర నల్లటి చారలతో చూపరులను కట్టి పడేసే కొల్లేటి అందాల అతిథి వైట్ ఐబీస్. కొల్లేరు వాసులు తెల్ల తల కంకణంగా పిలుస్తుంటారు.
కిన్నెరసాని.. చూసేకొద్దీ ప్రకృతి అందాలతో సందర్శకులకు కనువిందు చేసే పర్యాటక కేంద్రం. జలాశయం మధ్య ఎత్తైన వనాలతో కనిపించే ద్వీపం.. పర్యాటకులను ఆకట్టుకుంటోది.
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో రహదారులు నీటిమయంగా మారాయి.
రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్ దిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు.
ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ నటి శ్రీ లీల.
రాయదుర్గం ఐటీ కారిడార్‌లో గురువారం రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రిటైల్ ఎంప్లాయిస్ డే నిర్వహించారు.