చిత్రం చెప్పే విశేషాలు
(13-02-2025)
తిరుపతి: అంధ విద్యార్థులు బుధవారం ఎంతో శ్రద్ధగా రేడియో వింటూ కనిపించారు. గురువారం రేడియో దినోత్సవం సందర్భంగా చేజిక్కిన ఈ చిత్రం ఆకాశవాణి అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చేలా ఉంది కదూ!
భువనగిరి:ఈతచెట్టుకు గుంపుగా వేలాడుతున్న ఈ గిజిగాడి గూళ్లు చూపరులను మరిపింపజేస్తున్నాయి. గూడు నిర్మాణంలో ఇవి ప్రదర్శించే నైపుణ్యతకు ఆశ్చర్యపోవాల్సిందే.
పీతను చూడగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. అయితే అన్ని పీతలూ తినడానికి పనికిరావు. ఆకుపచ్చని చారలతో ఆకట్టుకునేలా ఉన్న దీని పేరు ‘అనోమురా పీత’.
మహబూబ్‌నగర్ సమీపంలోని మన్యంకొండ పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు జాతర పరిసరాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని సేదదీరారు. విద్యుద్దీపాలతో రాత్రివేళ మన్యంకొండ కాంతులీనింది.
విజయవాడ నగర సుందరీకరణలో భాగంగా అధికారులు గోడలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.
చింతపల్లి: ఎండు పుల్ల కాదు.. గొల్లభామ.. ఈ చిత్రంలో ఎండు పుల్లల మాటున ఓ కీటకం దాగి ఉంది. ఇది అచ్చం ఎండిపోయిన వాటితో కలిసిపోయింది.
మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామికి కృష్ణానదిలో తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
మార్సేలో భారత కాన్సులేట్ ప్రారంభం సందర్భంగా ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ల కరచాలనం
కాలీఫ్లవర్లు రెండు కేజీలలోపే బరువుంటాయి. చింతపల్లి వారపుసంతలో బుధవారం ఒక భారీ కాలీప్లవర్ ఏకంగా మూడున్నర కిలోలకు పైగా ఉండి ఆకట్టుకుంది.
కొత్తకోట: పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయంలో ప్రతిష్ఠ ఉత్సవాలు గురువారం నుంచి నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.