చిత్రం చెప్పేవిశేషాలు
(13-12-2024)
విజయవాడలో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్ర పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పాల్గొన్నారు.
ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా డి. గుకేశ్ నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన చదివిన అయనంబాక్కమ్‌లోని వెలమ్మల్ విద్యాలయంలో చిన్నారులు వేడుకలు చేసుకున్నారు. గుకేశ్ ఫొటోలు చేతపట్టుకొని చిన్నారులు శుభాకాంక్షలు తెలిపారు.
చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి రహదారులపై భారీగా వరదనీరు చేరింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కేబీఎన్ కళాశాలలో కృష్ణా తరంగ్ పేరుతో యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బాపట్ల జీబీసీ రోడ్డులో ప్రత్యేక వాహనంలో క్యారల్స్.
బంజారాహిల్స్‌లో గురువారం ‘నిమ్లే’ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సానియా మీర్జా హాజరై ప్రసంగించారు.
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘గ్రీన్ వాహనాల ఎక్స్‌పో-2024’ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం నూతన ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. మూడు రోజుల పాటు ఎక్స్‌పో జరగనుంది.
సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రానికి సంబంధించిన కార్నేజ్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.