చిత్రం చెప్పే విశేషాలు

(14-02-2025)

మహబూబ్‌నగర్‌: ఈ చిత్రం చూసి కొబ్బరి గెల నరికి చెట్టు మొదలు వద్ద ఉంచారని అనుకోకండి. ఆ గెలలు చెట్టు మొదలు వద్ద కాసినవే..ఆశ్చర్యంగా ఉంది.

 ప్రేమికుల రోజును పురస్కరించుకొని పలు ఉద్యానాలు, హోటళ్లు ప్రేమ గుర్తులతో నిండిపోయాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు పార్కులో లవ్‌ సింబల్‌ ఆకృతిలో విద్యుద్దీపాలను అలంకరించడంతో ఆకట్టుకుంటోంది.  

ఈ చిత్రం చూసి విద్యుత్తు దీపం అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. మహబూబ్‌నగర్‌ నడిబొడ్డున ఉన్న పెద్దచెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై విద్యుత్తు దీపంలాగే నింగిలోని నిండు చంద్రుడు పౌర్ణమి వేళ కనిపించాడు.

ప్రకృతి అందాలకు నెలవైన విశాఖలో పెద్ద సంఖ్యలో సినిమాలు చిత్రీకరించారు. వాటిలో ప్రేమ కథా చిత్రాలు ప్రత్యేకంగా నిలిచాయి.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. ఈ పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది ముఖద్వార రూపమే. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని.. అందరి కళ్లలో కదలాడిన ఈ ‘ఐకానిక్‌’ స్టేషన్‌ భవన్‌ ఇక కనిపించదు!

మొక్కేంటి తెల్లటి బంతులను కాసింది అని ఆశ్చర్యపోతున్నారా! ఇదీ విత్తన ఉల్లి పంట. మార్కెట్‌లో అధిక ధరలకు ఉల్లి నారు, విత్తనాలు కొనలేక కర్నూలు జిల్లా రైతులు సొంతంగా విత్తనాలు పండించుకుంటున్నారు.

మల్లూరు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు, వాహనదారులను ఇక్కడి పచ్చదనం, ప్రశాంత వాతావరణం కట్టిపడేస్తున్నాయి. కనుచూపుమేర పెద్దపెద్ద వృక్షాలతో ఆ రహదారి కనువిందు చేస్తోంది. 

రామసముద్రం-పుంగనూరు ప్రధాన రహదారిలోని విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో గురువారం ఉదయం ఓ నెమలి పురివిప్పి నాట్యం చేసింది.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-03-2025)

చిత్రం చెప్పే విశేషాలు(11-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(11-03-2025)

Eenadu.net Home