చిత్రం చెప్పే విశేషాలు
(14-03-2025)
గుంటూరు జిల్లా అత్తోట గ్రామ ఆదర్శ రైతు యర్రు బాపయ్య జనసేన పార్టీపై తన అభిమానం చాటుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ లోగోను తన జనుము తోటలో ఆవిష్కరించారు.
కోకాపేటలో దేశంలోనే ఎత్తయిన బహుళ అంతస్తుల భవనం ఎస్ఏఎస్ క్రౌన్ రంగుల పండగ హోలీకి వేదికైంది.
విశాఖ సాగర తీరంలో ఇసుక తిన్నెలపై ఆకృతులు సందర్శకులను ఆలోచింపజేశాయి. గురువారం కిడ్నీ దినోత్సవం. ఈ నేపథ్యంలో తీరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నగర సుందరీకరణలో భాగంగా తెలుగు తల్లి పైవంతెన - బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్ మధ్య కొత్త ఐల్యాండ్‌లో 3డీ ఆంగ్ల అక్షరాలు ఆకట్టుకుంటున్నాయి.
చిత్రంలోని వృద్ధుడి పేరు ఆర్.మాధవన్ పిళ్లై. ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. గురువారం తన వందో పుట్టినరోజు సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సరికొత్తగా ముస్తాబవుతోంది. క్రికెట్ క్రీడాకారులు, అభిమానులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
హోలీ పండగ నేపథ్యంలో గురువారం జమ్మూ శివారులోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సైనికుల సంబరాలు
విశాఖపట్నం ఆర్కే బీచ్‌కు రోజూ నడకకు వచ్చే చాలా మంది అక్కడి పావురాలకు గింజలు వేస్తుంటారు. వందల విహంగాలు అక్కడ సందడి చేస్తున్నాయి.