#eenadu

 కింగ్‌కోహ్లి విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులను మురిపించిన క్రీడాకారుడు. టెస్ట్‌మ్యాచ్‌లకు విరామం పలికిన నేపథ్యంలో ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఆయనను అభినందిస్తూ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. 

దిల్లీలో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ 

 చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని వేలూరులో వివిధ సంస్థల తరఫున పుష్ప పల్లకీ ఊరేగింపు సోమవారం రాత్రి నిర్వహించారు. 

రూఫ్‌టాప్‌ గార్డెన్లపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. బీఆర్కేభవన్‌ దారిలోని ఆదర్శ్‌నగర్‌ రోడ్డు నంబర్‌ 2లో ఓ అద్దాల మేడపై మిద్దె తోట ఆకట్టుకుంటోంది. విభిన్న రకాల మొక్కలు, పచ్చికబయలు కనువిందు చేస్తోంది.  

దేశంలోనే ప్రముఖ గాయకుడిగా పేరుగాంచిన మహ్మద్‌ రఫి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల భారత రిజర్వ్‌ బ్యాంకు ఆయన చిత్రంతో వంద రూపాయల నాణెం విడుదల చేసింది. 

పహల్గాం ఘాతుకానికి కారకులైన ఉగ్రవాదుల ఆచూకీ తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ జమ్మూకశ్మీర్‌లోని శోపియాన్‌లో మంగళవారం భద్రతా సిబ్బంది అతికించిన పోస్టర్‌ 

హైదరాబాద్‌లోని చౌమొహల్లా ప్యాలెస్‌లో మంగళవారం రాత్రి మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన విందులో నృత్యం చేస్తున్న సుందరీమణులు 

చిత్రం చెప్పేవిశేషాలు(19-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(18-05-2025)

Eenadu.net Home