చిత్రం చెప్పే విశేషాలు
(15-02-2025)
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులులు పోరాడుతూ ట్రాప్ కెమెరాకు చిక్కాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యాలయాన్ని స్వర్ణ విమానంపై పొందుపరిచే విష్ణుమూర్తి విగ్రహం ఆకర్షణీయంగా కనిపించేలా పొందుపరుస్తున్నారు.
గూడెంకొత్తవీధి: ఈ చిత్రాన్ని చూస్తుంటే ఒక చెట్టుపై మరొక చెట్టు పెరిగినట్లు కనిపిస్తోంది కదూ. నిజానికి ఇవి రెండూ వేరు వేరు చెట్లు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వినూత్నంగా వైమానిక ప్రదర్శన బెంగళూరులో ఈ నెల 10న ప్రారంభమైన 15వ ‘ఏరో ఇండియా’ ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీసంగమంలో శుక్రవారం భక్తుల పుణ్యస్నానాలు.. కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్
కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో వడ్డేపల్లి చెరువు మధ్యలో నుంచి రయ్‌మని దూసుకెళ్తున్న ఈ రైలు దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది.
రాజాపూర్‌లో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్ల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.