#eenadu

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ గోరఖ్‌నాథ్‌ ఆలయంలో శుక్రవారం నెమలికి ఆహారం పెడుతున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 

అమెరికాలోని కాలిఫోర్నియా నాపా కౌంటిలోలేక్‌ బెరీసియాలోని ‘గ్లోరీ హోల్‌’ స్పిల్‌వేలోకి గురువారం వెళుతున్న నీరు. 2019 తర్వాత చెరువు పొంగి ఇలా స్పిల్‌వేలోకి నీరు వెళ్లడం ఇదే తొలిసారి. 

 గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనృసింహస్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది.

#eenadu

నిజామాబాద్‌: చిత్రాన్ని చూస్తే పున్నమి నాడు వచ్చిన చంద్రుడు అని మీరు అనుకుంటే పొరపడ్డట్టే. నిజానికి ఇది సూర్యుడు. ఆకాశంలో సూర్యుడు ఇలా అచ్చం చంద్రుడిలా కనువిందు చేశాడు.

అట్ట ముక్కలతో తయారు చేసిన త్యాగరాజస్వామి విగ్రహం అద్భుత కళాఖండాలు తయారుచేయడంలో నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన కడాంబి నరసింహన్‌ ప్రావీణ్యం సాధించారు.

తిరుమలలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.

#eenadu

ధర్మపురి: కోనేటిలో హంస వాహన తెప్పపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి తెప్పోత్సవం జరిపారు. కోనేటి చుట్టూ ఐదు ప్రదక్షిణలుగా స్వామివారిని తిప్పిన అనంతరం.. ఊయలలో నిలిపి డోలోత్సవాన్ని నిర్వహించారు.

హోలీ సందర్భంగా స్థానిక రాధాకృష్ణ ఆలయం ఎదుట సుమారు 60 అడుగుల ఎత్తున నిర్మించిన కర్రల పోగు (హోలీ టవర్‌)ను దహనం చేశారు.

కృష్ణా జలాలు తగ్గుముఖం పట్టడంతో నంద్యాల జిల్లా కొత్తపల్లిలోని సంగమేశ్వరుడి గర్భాలయం బయటపడుతోంది.

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

Eenadu.net Home