#eenadu

హీరో నాని సోమవారం విశాఖలో సందడి చేశారు. ‘హిట్‌ 3’ చిత్రం ట్రైలర్‌ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ విశాఖ వాసులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. 

కరీంనగర్‌ సమీపంలోని ఎల్‌ఎండీ డ్యామ్‌ సమీపంలో అరుదైన పక్షి సోమవారం కనిపించింది. ఆ పక్షి రెక్కలు నలుపు, బూడిద రంగుల్లో కనిపించాయి. 

మహారాష్ట్రలోని అకోలాలో ఆర్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్, కాంగ్రెస్‌ షెడ్యూల్డ్‌ విభాగం ఆధ్వర్యంలో 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజ్యాంగ నిర్మాత చిత్రాన్నిరంగోలీ ద్వారా రూపొందించి ఘనంగా నివాళులర్పించారు.

జపాన్‌లోని ఒసాకా నగరంలో జరిగిన ఎక్స్‌పోలో ఆకట్టుకున్న బ్యాటరీతో నడిచే చిన్నపాటి విమానం 

#eenadu

గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రదర్శన  

విశాఖ ‘ఫిషింగ్‌ హార్బర్‌’కు పెద్ద సంఖ్యలో చేపలు తీసుకువచ్చారు. వాటిలో 27 కిలోల భారీ టేకు చేప కూడా ఉంది. ఇలాంటి వాటిని విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. మరో రెండు నెలల పాటు ఈ తరహా భారీ చేపలు రేవులో కనిపించవు.

రాజ్యాంగ పుస్తక రూపంలో 134 కిలోల కేక్‌ను జాగో ఇండియా జాగో ఫౌండేషన్‌ సభ్యులు ట్యాంక్‌బండ్‌ సమీపంలోని భారీ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కోసి ప్రజలకు పంచిపెట్టారు.

విశాఖలోని అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌లో పాలబూత్‌ కూడలి సమీపంలోని ఓ అపార్టుమెంటు వద్ద ఆకులు లేని బొప్పాయి చెట్టు.. కాయలతో ఆకర్షిస్తోంది. 

చెరుకుపల్లి గ్రామదేవత శ్రీపోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవం పురస్కరించుకుని సోమవారం అమ్మవారిని శ్రీచందనంతో అలంకరించారు. అమ్మవారి అలంకరణ ఆకట్టుకుంది. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(18-04-2025)

Eenadu.net Home