#eenadu

శివగిరి సదాయప్పస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేయగా.. ఓ భక్తుడు రూ.25 వేలకు దక్కించుకున్నారు.

వెలుగు నింపే ఆలోచన .. మారుతున్న సాంకేతికను నిరక్షరాస్యులు సైతం అందిపుచ్చుకుని ప్రయోజనాలను పొందుతున్నారు. ఉపాధి వెతుక్కుంటూ పలు ప్రాంతాలకు తిరిగే వలసదారులు అనంతపురం నగర శివార్లలో గుత్తిరోడ్డులో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని పొట్టపోసుకుంటారు. 

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మంగళవారం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శోభాయమానంగా పుష్పయాగం జరిగింది.

తమకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని డిమాండ్‌ చేస్తూ కేరళ రాజధాని తిరువనంతపురంలో మంగళవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ ర్యాంకర్లు

హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఫొటో ఫ్రేంను బల్దియా ఏర్పాటు చేసింది. అందులో నుంచి చూస్తే కొన్ని బొమ్మలు చేతులు కలిపి భూగోళం కళాకృతిని పట్టుకున్నట్లు కనిపిస్తాయి. 

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని మంగళవారం దాత సమర్పించిన 51 కేజీల బూందీ, మిఠాయిలతో అలంకరించారు. పూలు, బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. 

శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.

భారత్, అమెరికాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయాంఫ్‌-25 విన్యాసాలు ముగిశాయని నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. 

 చింతపల్లిలో పలుచోట్ల అమర్య లిల్లీ పూలు ఆకట్టుకుంటున్నాయి. పలువురు ఇళ్లల్లో అలంకరణకోసం వీటిని గార్డెనింగ్‌ ప్లాంట్స్‌గా పెంచుతున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(18-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(18-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు (17-04-2025)

Eenadu.net Home