చిత్రం చెప్పే విశేషాలు

(17-01-2025)

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ ముహాలాండ్‌ డ్రైవ్‌లో ఇటీవల కార్చిచ్చు కారణంగా కొండకు ఓ వైపున పూర్తిగా కాలిపోయి బూడిదకుప్పగా మారిన అడవి. ఇంకోవైపున ఇలా పచ్చనిచెట్లతో కళకళలాడుతోంది.

ఓ యువకుడి ఆలోచన.. పిండి మరాడించేటప్పుడు ఎదురయ్యే విద్యుత్తు అంతరాయాల సమస్యకు పరిష్కారం చూపింది. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ పట్టణంలోని బజార్‌వాడి రహమత్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ మాజిద్‌ అలీ పిండి మర(గిర్ని) నడుపుతున్నారు.

ఎండిపోయి మోడైన కొబ్బరిచెట్టు తొర్రల్లో గూళ్లు పెట్టుకుని జీవిస్తున్న చిలుకల చిత్రాలివి. కళావిహీనమైన చెట్టుకాండానికి రంధ్రాలు చేసి కాపురం ఉంటూ చిలుకలు కళ తీసుకొచ్చాయి. కంకిపాడు మండలం ఉప్పులూరు వెళ్లేదారిలో కనిపించాయిలా.. 

ఇదేంటి.. నాలాలో దుస్తులు ఆరేశారు అనుకుంటున్నారా? కాదండోయ్‌.. సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ నాలా మురుగు నీటిలో కొట్టుకొచ్చినవి ఇవి. పీలికలుగా మారాయి. 

పుష్పగుచ్ఛంలా ఉన్న ఈ చామంతి పూలను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇవన్నీ ఒకే మొక్కకు పూసినవి కావడం విశేషం. కాకినాడ గ్రామీణ మండలం చీడిగలోని ఓ ప్రైవేటు నర్సరీలో వీటిని పెంచుతున్నారు.  

ఏపీఆర్‌ గురుకుల పాఠశాల పక్కనున్న మద్దిగెడ్డ రిజర్వాయర్‌ ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటోంది. పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

సంక్రాంతి ముగింపు వేడుకల్లో భాగంగా గురువారం గొబ్బెమ్మల నిమజ్జనానికి పెన్నాతీరం వేదికైంది. వేడుక అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావరణంలో గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు.

ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాం బీచ్‌లో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(04-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(04-02-2025)

Eenadu.net Home