#eenadu
కాకినాడ: ఓ పక్షి (లవ్‌బర్డ్) తన చిరుప్రాణికి ఇలా గింజలనందిస్తూ కడుపు నింపేందుకు ప్రయత్నిస్తోంది. రెక్కలార్చని తన చిరుప్రాణుల ఎదుగుదలకు ఇలా ఆరాటపడుతోంది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది.
ఉదయం ఏడు గంటల సమయంలో కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని పలు ప్రాంతాలు ఊటీలోని ప్రకృతిని తలపించాయి. సాలెగూళ్లు ముత్యాల అల్లిక మాదిరి మెరిశాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు వెనకజలాలు తగ్గడంతో గోదావరిపై పురాతన వంతెన ఆదివారం బయటపడింది.నూతన వారధి పైనుంచి కిందకి చూస్తే పురాతన వంతెన నదిపై పరుచుకున్నట్లు కనువిందు చేస్తోంది.
శంషాబాద్‌లో ఆకాశహర్మ్యాలకు కొత్తందాలను జోడిస్తున్నారు. చుట్టూ విభిన్న మొక్కలు పెంచడం.. రూఫ్‌టాప్‌ను పచ్చదనంతో అలంకరించడం వంటివి చాలా భవనాల్లో కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆదివారం దర్శించుకున్నారు.
శివసత్తుల పూనకాలు.. డప్పుచప్పుళ్లు.. పోతురాజుల విన్యాసాలు.. కిక్కిరిసిన భక్తుల నడుమ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో మల్లన్న బోనాల సంబరం అంబరాన్నంటింది.
కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుండగా పది గంటలకల్లా భానుడి భగభగలు మొదలవుతున్నాయి.అనంతుని గిరిపై అలరించిన మంచు సోయగమిది.
హైదరాబాద్ :అసెంబ్లీ పక్కనున్న పబ్లిక్ గార్డెన్స్‌లో ఓ ఉడతకు నీళ్లు దొరకలేదేమో.. సందర్శకులు తాగి వదిలేసిన నీళ్ల బాటిల్‌లోకి మూతి దూర్చి ఇలా దాహం తీర్చుకుంటూ కనిపించింది.
సచివాలయం, అమరవీరుల స్తూపం పరిసరాల్లో ఖాళీగా రహదారులు