చిత్రం చెప్పే విశేషాలు

(18-01-2025)

పిఠాపురానికి చెందిన కొత్తెం పశువులరావు, రాణి దంపతులు తమ అల్లుడికి 160 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం డొల్లార సమీపంలోని తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దున పెన్‌గంగ నది తీరాన గంగమ్మ తల్లికి శుక్రవారం బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజన సందోహంతో నదీ తీరం కళకళలాడింది. 

కంటితో చూసిన చిత్రాలను చేత్తో అవలీలగా గీసేస్తారు.. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడాన్ని సాధన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విభిన్న రకాల చిత్రాలు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.  

మదిలో మెదిలే భావాలకు సృజనాత్మకతను జోడించడమే చిత్రకళ. అలాంటి చిత్రాల ప్రదర్శనకు అమలాపురం పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపం వేదిక కానుంది. ఈనెల 19న 35వ అంతర్జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించనున్నారు. 

సెలవుల వేళ.. ఈత సరదా..సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వచ్చిన పిల్లలు కూడేరులో పీఏబీఆర్‌ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీటిలో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం సిద్ధం చేసిన విలాసవంతమైన టెంట్లు .

కూటమి ప్రభుత్వ రాకతో రాజధాని అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. వీటికి పూసిన పలు వర్ణాల పూలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మార్గంలో వెళ్లే వారు సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు శుక్రవారం శ్రీపార్వతీ సమేత మల్లికార్జునస్వామికి నేత్రశోభితంగా అశ్వవాహనసేవ జరిగింది. అనంతరం స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

భువనగిరి కోటను శుక్రవారం పలు ప్రాంతాల విద్యార్థులతోపాటు పర్యాటకులు సందర్శించారు. వికారాబాద్‌ జిల్లా పెద్దముల్‌ పట్టణంలోని వాగ్దేవి, శ్రీవాణీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విహార యాత్రలో భాగంగా కోటను సందర్శించేందుకు వచ్చారు. విద్యార్థులు కోట నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు.  

అమెరికా అధ్యక్షుడికి.. వైట్‌ హౌస్‌తో పాటు సకల సౌకర్యాలు!

చిత్రం చెప్పే విశేషాలు(20-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(20-01-2025)

Eenadu.net Home