చిత్రం చెప్పే విశేషాలు

(18-02-2025)

మహా కుంభమేళా సందర్భంగా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమానికి పోటెత్తిన భక్తలు.

 హుస్సేన్‌సాగర్‌లో నీళ్లు సోమవారం సంధ్యవేళ సువర్ణ రంగులో కనిపించాయి. మరోవైపు క్రీడాకారులు సెయిలింగ్‌ సాధన చేస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు. 

దిల్లీలో సోమవారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను కలిసిన బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌.

గోడలు.. పాఠాలు చెబుతాయ్‌..! వేలేరుపాడు మండలం భూదేవిపేట కస్తూర్బాగాంధీ విద్యాలయంలో గోడలు విజ్ఞానాన్ని పంచుతున్నాయి.  

ఈ చెట్టు వయసు 135 ఏళ్లు.. ధర రూ.35 లక్షలు.. అరుదైన మొక్కలు, వృక్షాలతో జాతీయస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు పేరుగాంచాయి. 

హైదరాబాద్‌: నగర సుందరీకరణలో భాగంగా పలు కూడళ్లు, రహదారులపై కనువిందు చేసే చిత్రాలను, ఆకృతులను ఏర్పాటు చేస్తున్నారు. 

కర్నూలు నగరంలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాల విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. చిమ్మచీకట్లో ఆదివారం రాత్రి కొండపై అద్భుతాలు చేశారు.

నారాయణగూడ: చారిత్రక నిజాం కళాశాల ప్రహరీ చుట్టూ.. విద్య ప్రాధాన్యం తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించేలా చిత్రాలు వేశారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల అడవుల్లో మరో అరుదైన జాతి పక్షిని వన్యప్రాణి నిపుణులు గుర్తించారు.నీలి చెవుల కింగ్‌ఫిషర్‌ అనే పక్షి కనిపించింది.

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home