#eenadu

పందెంకోళ్లలా కాలు దువ్వుతున్న ఈ నీటి పక్షులు రాజధాని అమరావతిలోని హైకోర్టు సమీపంలో నీటికుంటలో కనిపించాయి. అవి అమాంతం గాల్లో ఎగిరి కాళ్లతో రక్కుకుంటూ, ముక్కుతో పొడుచుకుంటూ హోరాహోరీ తలపడ్డాయి.

రంజాన్‌ మాసం కావడంతో చాలామంది హలీం రుచులను ఆస్వాదిస్తున్నారు. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి బల్కంపేట రోడ్డులో ఓ వ్యక్తి దుకాణం ముందు ఇలా పొట్టేలు బొమ్మను ఉంచి హలీం విక్రయిస్తున్నారు. 

జిల్లేడు జాతికి చెందిన చెట్ల ఆకులను తింటూ కనిపించే ఈ కీటకం పేరు గ్రీన్‌ హాక్‌మాత్‌. మామిడికుదురులో కనిపించింది. రంగులతో ఆకర్షణీయంగా కనిపించింది.

ముమ్మిడివరంలో స్థానిక పోలమ్మచెరువు మధ్యలో ఏర్పాటు చేసిన భగవాన్‌ బాలయోగీశ్వరుల విగ్రహం హిమపాతంలో కనువిందు చేసింది. చెరువులో నీళ్లను మంచు కప్పేయడంతో విగ్రహం గాలిలో తేలినట్లు కనిపించింది.

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి కుమారుడు సంతోష్‌రెడ్డి వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. 

గూడెంకొత్తవీధి : చూసేందుకు కర్ర ముక్కలా కనిపిస్తున్న ఈ జీవి కదిపితే తలెత్తి కసురుతోంది. ఒళ్లంతా జూలు నింపుకొని మెత్తగా కనిపిస్తోంది. 

గుల్లలపాలెం: పిల్లల ఆటలు.. పెద్దలు మాటామంతి.. యువకుల కోలాహలం.. ఇలా ఎటు చూసినా ఆ ఉద్యానవనం సందర్శకులతో కళకళలాడుతోంది.

పద్మనాభంలోని అనంతుని గిరిపై నుంచి ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి. ఉదయం మంచు దుప్పటి కప్పుకొని శ్వేతవర్ణంలో కనువిందు చేసే పరిసర ప్రాంతాలు సాయంత్రం అయ్యే సరికి భానుడి కిరణకాంతులతో సువర్ణ శోభితమై నయనానందం కలిగిస్తున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(11-04-2025)

Eenadu.net Home