#eenadu
హయత్‌నగర్ సమీప కుంట్లూరులో రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు చాలా ఖరీదైపోయాయి.ఓ వైపు ఇళ్లు, మరోవైపు పచ్చనిపొలాలు ఇలా కనువిందు చేస్తున్నాయి.
మహ్మదాపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఇరిక ఆకుపై వేసిన ఏసుక్రీస్తు చిత్రం అబ్బురపరిచింది.
#eenadu
త్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కోట్రేశ్. బెంగళూరు వాసి. రూ.70 వేలు వెచ్చించి పూర్తిగా సోలార్‌తో నడిచే సైకిల్ తయారు చేయించాడు.
జర్మనీలోని ఎకెంటల్‌లో ఒంటికాలితోనే జట్టు సభ్యులతో కలిసి సాధన చేస్తున్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు పియర్రే కైసర్.
శ్రీశైల మహాక్షేత్రంలోని ఆలయ దక్షిణ మాడవీధిలో గురువారం కళారాధన కార్యక్రమం జరిగింది. కళాకారిణులు కుండలపై చేసిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది.
వీధి వ్యాపారం ఏదైనా క్రమంగా చక్రాలపైకి చేరుతోంది. చక్రాల చెరకు రసం బండి నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డుపై సాగుతున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్ మనిపించింది.
పొదలకూరులోని పూలచెట్లపై సిపాయికి దుస్తులేసినట్లుగా సీతాకోక చిలుక పువ్వుల్లోని మకరందాన్ని పీలుస్తూ కనిపించింది. రెండు కొమ్ములను ముందుకు చేర్చి మొక్కలపై అటు, ఇటు తిరుగుతూ కనువిందు చేసింది.