చిత్రం చెప్పేవిశేషాలు
(18-12-2024)
మణిపుర్ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘చలో రాజ్‌భవన్’ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ సమీపంలో సీఎం బైఠాయించిన నిరసన తెలిపారు.
విజయవాడలో జల్‌జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడారు.
భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తర్వాత అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి.
చెన్నైలో ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్‌కు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా అభినందన పరేడ్ నిర్వహించారు. సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గుకేశ్‌ను అభినందించారు.
తాజంగిలో జలవిహారం పర్యాటకులను మధురానుభూతులను పంచుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కొందరు గిరిజన యువకులు తాజంగిలో సంఘంగా ఏర్పడి జలాశయంలో బోటు షికారు నిర్వహిస్తున్నారు.
భారాస సభ్యులు మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సత్యవతి రాథోడ్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కవిత మాట్లాడారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా.. సికింద్రాబాద్‌లోని ఓ షాపు వద్ద అలంకరించిన నక్షత్ర దీపాలతో పరిసరాలు వెలుగులు జిమ్ముతూ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.