చిత్రం చెప్పే విశేషాలు

(19-02-2025)

కుంభమేళాలో పవిత్రస్నానమాచరించి నదీమతల్లికి హారతి ఇస్తున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దంపతులు, కుమారుడు అకీరా నందన్‌. చిత్రంలో సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ .

కర్నూలు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న విజ్ఞాన మేళా 4.0 సందర్శకులను ఆకట్టుకుంటోంది. హ్యూమైండ్‌ రోబోటిక్స్‌ ప్రదర్శన అలరించింది. 

చిత్రం చూస్తే నందీశ్వరుడు కారెక్కినట్లు కనిపిస్తోంది కదూ.. మహానంది దేవస్థానం ఎదురుగా కృష్ణశిలతో జీవకళ ఉట్టిపడేలా రూపొందించిన నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

రాష్ట్రపతి భవన్‌ వద్ద మంగళవారం ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానితో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ.

ఆకాశంలో సీతాకోక చిలుకలు విహరిస్తున్నట్లు ఉన్న ఈ దృశ్యం వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారి ఆర్టీఏ కూడలిలోనిది. 

వీరమ్మ తల్లి నామస్మరణతో ఉయ్యూరు పట్టణం మార్మోగింది. తిరునాళ్లలో కీలక ఘట్టమైన ‘సిడిబండి’ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

బండ్లగూడజాగీర్‌: శాంతికి ప్రతీకగా నిలిచే తెల్ల పావురం ఆకృతిలో 2,111 మంది నిల్చొని గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.

చిత్రంలో కనిపిస్తోంది ముల్లంగి దుంప. సాధారణంగా ఈ దుంపలు క్యారెట్‌లా.. బారుగా ఉంటాయి. కడుపులో బిడ్డ పెనవేసుకున్నట్లున్న ఈ దుంప చౌడువాడలో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు విక్రయించే ఓ వ్యక్తి వద్ద గంపలో కనిపించింది. 

శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ తాటిచెట్టుపై ఉన్న గెలలపై ఊరే కల్లును రామచిలుక తాగుతూ సేదతీరుతున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home