#eenadu

యానాంలోని ప్రధాన పర్యాటక ప్రదేశం రాజీవ్‌ రివర్‌బీచ్‌ ఆదివారం సాయంత్రం సందర్శకుల్ని ఆకట్టుకుంది. సూర్యాస్తమయ వేళ దట్టమైన మబ్బులు కమ్మి, వాతావరణం చల్లని గాలులతో ఆహ్లాదకరంగా మారింది. 

కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఆదివారం చేపట్టిన బర్డ్‌వాక్‌(పక్షుల వీక్షణం) కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. 

 విజయవాడ స్క్యూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్‌ జగన్నాథ స్వామి మందిరంలో ఆదివారం చందన సేవను వైభవంగా నిర్వహించారు.

 ప్రపంచ సుందరి పోటీదారులు ఆదివారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తోపాటు సచివాలయాన్ని సందర్శించారు.

ఆదివారం రాత్రి నగరంలో కురిసిన వానకు రాష్ట్ర సచివాలయ భవనం ముందు నీరు నిలిచింది. విద్యుత్తు దీపాల వెలుగులో కాంతులీనుతున్న ఆ భవన ప్రతిబింబం వాన నీటిలో ఇలా ఆకట్టుకుంది.  

చాలారోజుల తరువాత ట్యాంక్‌బండ్‌పై సన్‌ డే ఫన్‌డే కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డ్రోన్‌ షో ఆకట్టుకుంది.

 ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఎగ్జిబిషన్‌లో కూలిపోయిన జెయింట్‌ వీల్‌

రాజమహేంద్రవరంలోని రామకృష్ణ మఠంలో ఏప్రిల్‌ 24 నుంచి నిర్వహించిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ కాలంలో నేర్చుకున్న పలు యోగాసనాలను చిన్నారులు ఇలా ప్రదర్శించి అలరించారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(18-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home