చిత్రం చెప్పేవిశేషాలు

(19-12-2024)

 సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

మన్యంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. 

మంచిరేవుల, నార్సింగి, ఓఆర్‌ఆర్‌ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఆకాశహర్మ్యాలు, దూసుకెళ్లే రహదారులతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. 

చలి తీవ్రత కారణంగా పొగమంచుతో పాటు గాలిలో కలిసి వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. నోరు, ముక్కు, కళ్లకు రక్షణ కల్పించేలా ప్రత్యేకమైన మాస్కులు ధరించి వెళుతున్నారు.

మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు క్రిస్మస్‌ సంబరాల్లో సందడి చేశారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(04-02-2025)

Eenadu.net Home