చిత్రం చెప్పే విశేషాలు
(20-01-2025)
చిట్టి ముక్కు.. పొడవాటి కాళ్లు.. మెడ చుట్టూ నల్లని వలయం.. పసుపు, నలుపు రంగు కలిగిన చిట్టి ముక్కు.. పొడవాటి పసుపు వర్ణపు కాళ్లతో ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి లిటిల్ రింగ్డ్ ప్లోవర్.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గమ్మ పుణ్యక్షేత్రం సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు (ఘనపురం ఆనకట్ట) జలకళను సంతరించుకుంది.
ఈ చిత్రం చూస్తుంటే ఇంటి పైన ఆకుపచ్చ వర్ణంతో కప్పు వేసినట్లు కనిపిస్తోంది కదూ..! భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఇంటి ముందు ప్రత్యేకంగా ఉన్న ఈ తీగ జాతి చెట్టు ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ధారూర్ మండల కేంద్రంలో ఆదివారం మైసమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఆదివారం ఉదయం చెరువులవెనం వ్యూ పాయింట్ వద్ద పరుచుకున్న పొగమంచు.
బెంగళూరులో చరిత్ర ప్రసిద్ధిగాంచిన లాల్‌బాగ్ ఉద్యానవనంలో ఆదికవి మహర్షి వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన తిలకించేందుకు సందర్శకులు పొటెత్తారు. కొబ్బరి ఆకులతో తయారు చేసిన కళాకృతులను తిలకిస్తున్న సినీనటి ప్రేమ.
హుస్సేన్‌సాగర్‌లో మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్శకులను అలరిస్తోంది. పాటలకు అనుగుణంగా నీటి ధారలు నృత్యం చేస్తుండటంతో కేరింతలతో సందడి చేస్తున్నారు. వారాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శన కనువిందు చేస్తోంది.
కర్నూలు-ఓర్వకల్లు మార్గంలో రైతులు పెద్దఎత్తున పొగాకు సాగు చేస్తున్నారు. హైబ్రీడ్ పొగాకు రకానికి పెద్దఎత్తున పూలు పూయడంతో ఆహ్లాదకరంగా మారింది. అటువైపు వెళ్లేవారిని ఈ దృశ్యం కనువిందు చేస్తోంది.
గాల్లో పంచ ప్రాణాలు.. ఈ చిత్రం కర్నూలు-కడప జాతీయ రహదారిపై కనిపించింది. అయిదుగురికి తోడు హ్యాండిల్ పై లగేజీ బ్యాగు... ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో దీపాలే.
తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హొగినేకల్‌కు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర పలు రాష్ట్రాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతిరోజు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.