చిత్రం చెప్పే విశేషాలు

(20-02-2025)

ఆస్ట్రేలియాలోని టాస్మానియా ద్వీపంలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలాలు. మొత్తం 157 తిమింగలాలు తీరానికి రాగా.. అందులో 136 వరకు ప్రాణాలతో ఉన్నాయని అధికారులు తెలిపారు. 

కొత్త సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ఎన్నికల కమిషనర్‌ వివేక్‌ జోషితో కమిషనర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు.

కరీంనగర్‌ నగరపాలిక శివారులోని గోపాల్‌పూర్‌ గ్రామంలో ఉన్న చిన్న కుంట వద్ద చేపల కోసం వచ్చి బండమీద వేచి ఉన్న బుడుబుంగ (చిన్న నీటికొంగ)లు ఇవి. 

 హైదరాబాద్‌: చిన్నచిన్న రాళ్లతో మనిషి ఆకృతిని మలిచి.. కపోతానికి స్వేచ్ఛను ప్రసాదిస్తున్నట్లుగా తయారు చేసిన ఈ కళారూపం అబిడ్స్‌ చౌరస్తాలోనిది.

మద్దూరు:కృష్ణా తీరం.. చిక్కాలి మీనం.. నదీ పరివాహక గ్రామాల్లోని వేలాదిమంది మత్స్యకారులకు ‘కృష్ణమ్మ’ ఉపాధి కల్పిస్తోంది. 

ప్రపంచంలో వివిధ రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖుల చిత్రాలతో విశాఖ ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్సు విభాగం సమీపంలో ‘డ్రీమ్‌ వాల్‌’ ఏర్పాటు చేశారు.  

నీలగిరి: ఈ ఏడాది శివరాత్రి ముందు నుంచే ఎండల ప్రభావం పెరగడంతో మార్కెట్‌లోకి కుండలు వచ్చాయి. నల్గొండ పట్టణంలో కుండలను ఇలా బయట పెట్టి ఉంచగా ‘న్యూస్‌టుడే’ తీసిన చిత్రమిది.

కరీంనగర్‌లోని జిల్లా సైన్స్‌ మ్యూజియం (మినీ ప్లానిటోరియం )సందర్శన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

మండపేట మండలం ఏడిద-సంగం రోడ్డులోని శ్రీసాయిరాఘవేంద్ర రోజ్‌ గార్డెన్స్‌లో రైతు మార్ని నారాయణరావు అరుదైన అరటిని పండిస్తున్నారు. దీన్ని థౌజండ్‌ ఫింగర్స్‌ అని పిలుస్తారు. 

మహా కుంభమేళా సందర్భంగా బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు.

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home