చిత్రం చెప్పే విశేషాలు
(21-01-2025)
అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది ఆయనకు అభినందనలు తెలిపారు.
కనుచూపు మేర పచ్చటి పైట కప్పేసుకున్నట్టు కనిపిస్తున్న అడవి. కనువిందు చేస్తూ అక్కడో నీలి రంగు పులుముకున్న నీటి కుంట. ఈ చిత్రం మంచిర్యాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గఢ్‌పూర్‌లోని ‘జంగిల్ సఫారీ’ లోనిది.
ఎమ్మిగనూరు పట్టణంలో పింఛనర్ల రాష్ట్ర మహాసభను సోమవారం నిర్వహించారు.. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన స్వాగత నృత్యం ఆకట్టుకొంది.
బతుకు చిట్కా బండి.. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అక్బర్ వలి. ఒంగోలు డెయిరీ ఎదుట కర్నూలు రోడ్డులోని ఆక్రమణల తొలగింపులో భాగంగా ఈయనకు చెందిన గ్యాస్ వెల్డింగ్ దుకాణమూ పోయింది. బతుకు తెరువుపోయిందని తొలుత బాధపడినా.. తరువాత తన ఆలోచనకు పదును పెట్టారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం భక్తులు పట్నం, అగ్నిగుండాలను తొక్కడానికి పోటీపడ్డారు. భక్తులు ఒకరినొకరు బండారు పూసుకోవడంతో ఆలయ పరిసరాలు దట్టమైన పసుపు వర్ణమయ్యాయి.
గోస్తనీ నదిపై ఉన్న తాటిపూడి జలాశయానికి పర్యాటక హంగులు అద్దుతున్నారు. మొన్నటివరకు సాయంత్రం అయితే గట్టుపై చిమ్మ చీకటి అలుముకునేది. సోమవారం నుంచి విద్యుత్తు వెలుగులతో కొత్త కళను సంతరించుకుంది.
సంకేతాల కోసం పాటు.. హలో.. హలో వినిపిస్తోందా.. చింతగూడలో చెట్టుకు డబ్బా కట్టి అందులో చరవాణి పెట్టి మాట్లాడుతున్న వ్యక్తి. చేనులో ఓ మూలన ఇలా సంకేతాల కోసం ప్రయత్నిస్తున్న కోరకంటి వాసి .
నల్లటి ఆకారంతో గగనతలంలో రివ్వున ఎగురుతూ చూపరులను ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి పైడ్ బుష్ చాట్.
ప్రాణాలకే కాదు.. పంటలకు శిరస్త్రాణమే.. జగిత్యాల మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు రక్షణగా శిరస్త్రాణంతో కూడిన బొమ్మను ఏర్పాటు చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వెళ్లే క్రమంలో ఇటలీ నుంచి ఎరిక్, రబాక జంట నగరానికి వచ్చింది. ఇక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ ఎన్టీఆర్ మార్గ్‌లో.. ఉడికించి, నిమ్మరసం, మసాలా దట్టించిన మొక్కజొన్న పొత్తులను రుచి చూసింది.