చిత్రం చెప్పే విశేషాలు
(21-02-2025)
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భ్రమరాంబ, మల్లన్న ఆలయాలను భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
ఆర్కేనగర్ : ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా ‘తమిళ్’ అని అక్షర రూపంలో నిలబడిన చెన్నై వళ్లియమ్మాల్ మహిళా కళాశాల విద్యార్థినులు .
సుందరీకరణలో భాగంగా నగరంలోని టోలిచౌకి సాలార్ వంతెన కింద ఏర్పాటు చేసిన రైలు ఇంజిన్ ఆకృతి వాహనదారులను ఆకట్టుకుంటోంది.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో అలరారుతోంది. ఉత్సవాల రెండోరోజైన గురువారం రాత్రి భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లు భృంగి వాహనంపై కొలువుదీరి పూజలందుకున్నారు.
ముత్తుకూరు సెంటర్ నుంచి చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో తుక్కు ఇనుముతో తయారు చేసిన సింహపురి సింహం బొమ్మ కొత్త కాంతులతో అలరిస్తోంది.
రుషికొండ తీరంలో గురువారం మత్స్యకారుల వలకు రుచికరమైన పసుపు రంగు ఆకర్షణీయ పీతలతో పాటు రెండు పెద్ద మృత కప్పలు చిక్కాయి.
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం విద్యుత్తు వెలుగులతో విరాజిల్లుతోంది. సువర్ణముఖి నదీతీరం మరింత దేదీప్యమానంగా దర్శనమిస్తోంది.
యానాం రాజీవ్ రివర్‌బీచ్ : వేసవి ఎండలు తీవ్రమౌతున్న తరుణంలో భానుడు అరుణవర్ణంలో ప్రజ్వరిల్లుతూ.. అస్తమిస్తున్న దృశ్యాలు సందర్శకుల్ని అబ్బురపరుస్తున్నాయి.
ఒంగోలు:ఎండలు మండుతుండడంతో మధ్యాహ్నం వేళలో ప్రయాణానికి ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వినూత్నంగా ఆలోచించారు.
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఉన్న విభాగినుల మధ్యలో స్తంభాలకు తెలుగు అక్షరమాల ఏర్పాటు చేశారు
ముంచంగిపుటు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున జోలాపుట్టు జలాశయం దిగువన విస్తరించిన మత్స్యగెడ్డ పరివాహకంలో అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.