#eenadu

 శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం నయన శోభితంగా సాగింది.

కరీంనగర్‌: రెండు మయూరాలు గింజలు తినడానికి దగ్గరగా రాగా.. ఒకటి కిందకు.. మరొకటి పైకి చూస్తోంది. ఈ క్రమంలో ఆ రెండు నెమళ్లకు ఒకే తల అన్నట్లుగా కనిపించింది.

అమరావతి ప్రాంతంలో పచ్చని చెట్లు నీడను పంచుతూ సందర్శకులను ఆహ్వానిస్తున్నాయి. ఈ ప్రాంతం పచ్చదనంతో మరింత అందంగా కనిపిస్తోంది. 

నెల్లూరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా తల్పగిరి రంగనాథస్వామి వారి తెప్పోత్సవం గురువారం కనులపండువగా జరిగింది.

మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ‘అమరావతి చిత్ర కళా వీధి’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌.. చిత్రంలో రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ తేజస్వి పొడపాటి తదితరులు 

సత్యవ్రత భాస్కర క్షేత్రంగా శ్రీకాళహస్తి దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. సూర్యాస్తమయ సమయంలో కైలాసగిరులపై కొలువుదీరిన ఉమాదేవి సమేత చంద్రశేఖరమూర్తులపై తన కిరణాల తేజసంతో ప్రణమిల్లడం చూపరులను మరింతగా ఆకట్టుకుంది. 

విశాఖపట్నం: అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఆవరణలో ఓ బొన్సాయ్‌ చెట్టు అందరినీ ఆకర్షిస్తోంది.

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనలు కళాప్రియులను ఆకట్టుకున్నాయి.

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(11-04-2025)

Eenadu.net Home