చిత్రం చెప్పేవిశేషాలు
(21-12-2024)
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్ హోం’ ఆహ్లాదకరంగా జరిగింది. శీతాకాల విడిది కోసం ద్రౌపదీ ముర్ము ప్రముఖులకు తేనీటి విందుతో ఆతిథ్యమిచ్చారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎటు చూసినా విద్యుద్దీపాల వెలుగులు ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సచివాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ వద్ద చిన్నారులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెద్దసంఖ్యలో భక్తులు భవాని దీక్షలను విరమించుకుంటున్నారు. భవానీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రిస్మస్ సమీపిస్తున్న తరుణంలో వివిధ దేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. పలు నగరాలు విద్యుత్ దీప కాంతులతో సుందరంగా ముస్తాబయ్యాయి.
చలి గాలులు, చిరు జల్లులతో జనం వణుకుతున్నారు. పక్షులు సైతం గూడు విడిచి రాలేకపోతున్నాయి.
క్రిస్మస్ సమీపిస్తున్న తరుణంలో పండుగ షాపింగ్‌తో ముంబయి నగరంలో వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి.
శిల్పారామంలో ‘ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా’నిర్వహించారు.
ఈ సందర్భంగా కూచిపూడి కళాకారిణి పుష్యమి నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రీడల్లో రెండోరోజు కొనసాగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు.
కొలంబియాలో క్రిస్మస్ వేడుకలు.