చిత్రం చెప్పే విశేషాలు

(22-01-2025)

కళాకారుడి కుంచె నుంచి జాలువారినట్లున్న ఈ చిత్రాన్ని ఏ ప్రదర్శనలోనో ఉంచారనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే ఇది ప్రకృతి కాన్వాస్‌పై కాలం గీసిన బొమ్మ. ఈ దృశ్యం పెద్దపల్లి జిల్లాలోనిది.

శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వానర బెడదకు కేశవపట్నంలో ఓ ఇంటి యజమాని తన ఇంటి గేటుకు కొండెంగ బొమ్మ ఏర్పాటు చేసిన దృశ్యమిది.  

బుగ్గారం జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో మంగళవారం నెమలి సందడి చేసింది. పాఠశాల ప్రాంగణంలో కలియ తిరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందంగా వీక్షించారు.  

నీలాకాశం, నల్లని నేల నడుమ పసుపు వర్ణంలో కనిపిస్తున్నది ఇసుక తిన్నె అనుకుంటే పొరపాటే. ఇది కోతకొచ్చిన పప్పుశనగ పంట. ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఇది ఈ మార్గంలో వెళ్తున్న వాళ్లందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

దేశంలోని ఈశాన్య ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించడం మణిపుర్‌ ప్రత్యేకత. త్రిపుర సంస్కృతి చాలా గొప్పది.

పసుపు వర్ణంతో ఆకట్టుకునే నుదిటి భాగం.. నల్లటి గొంతుతో చూపరులను ఇట్టే ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి బయా వీవర్‌.

ఈ వాహనాలను చూస్తే నగరం ఖాళీ అవుతున్నట్లుంది కదూ.. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా హయత్‌నగర్‌ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి.  

చూడటానికి అది తాటిచెట్టు.. కానీ కాయలేమో ఈతకాయల మాదిరిగా గెలలు గెలలుగా కాస్తుంది. మణుగూరులోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈ చెట్టు ఉంది. చాలా మంది దీన్ని వింతగా చూస్తూ ఉంటారు.

రివ్వున ఆకాశంలో ఎగురుతున్న ఆ చిలుకల జంటకు తాటిచెట్టు పై బొట్లుగా కారుతున్న కల్లు కనిపించింది.. ఇంకేం.. ఆలస్యం చేయకుండా తనివి తీరా ఆస్వాధించాయి.

హరివిల్లులోని వర్ణాలన్నీ నేలపై పూసినట్లుగా ఉంది కదూ.. హిమాయత్‌సాగర్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న ఎకో పార్కులోని సుందర దృశ్యమిది. అటూ ఇటూ రంగురంగుల పూలు.. వాటి నడుమ వంపులు తిరిగిన నడకదారి కనువిందు చేస్తోంది. 

డాల్ఫిన్‌ హోటల్‌ కూడలిలో.. నగరంలోని వివిధ కూడళ్ల వద్ద జీవీఎంసీ అధికారులు సుందరీకరణ పనులు నిర్వహించారు. ఫౌంటెయిన్‌లు ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుద్దీపాలు అమర్చడంతో అటుగా వెళ్లే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(07-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(06-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(06-02-2025)

Eenadu.net Home