చిత్రం చెప్పే విశేషాలు

(22-02-2025)

నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు హంసవాహనంపై కొలువుదీరారు.

సూర్యాస్తమయంలో బేగంపేట వద్ద ఓ విద్యుత్తు స్తంభంపై ఒంటికాలిపై కొంగ నిల్చున్న చిత్రం ఇలా కనువిందు చేసింది.

తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో పరీక్ష రాసినవారికి నియామకాలు అందించాలని కోరుతూ శుక్రవారం చెన్నైలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాస్క్‌లు ధరించి పోరాటం చేస్తున్న దృశ్యం .

తూంకుంట పరిధిలోని ఓ రిసార్టు ప్రవేశద్వారం వద్ద.. సందర్శకులను ఆకట్టుకునేలా పాత ట్రాక్టర్లు, లారీల విడిభాగాలతో ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఖజురాహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటలసేపు చేసిన సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్‌ రికార్డు గౌరవం దక్కినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

మహబూబాబాద్‌ : చెట్టు కింద చుట్టూ రేకులు.. సరకులు తీసుకునేందుకా అన్నట్టు మధ్యలో ఓ కిటికీ. చూడగానే.. చిన్న దుకాణం భలే ఉందే అనిపిస్తుంది కదూ..! కానీ, ఇది దుకాణం కాదు.. గ్రామపంచాయతీ కార్యాలయం!! 

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థులు పర్యావరణహితంగా పుష్పగుచ్ఛాలు తయారు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని చూడండి.. సికింద్రాబాద్‌ తుకారంగేట్‌ ప్రాంతంలో ఫుట్‌పాత్‌కు ఆనుకొని ఉన్న గోడలపై వేసిన పెయింటింగ్‌ ఇది. అచ్చం అక్కడో ద్వారం ఉన్నట్లు భ్రమింపజేసేలా వేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home