#eenadu

ఒకే సమయం.. ఒకే చోటు.. ఒకే చిత్రం.. కానీ వారి అవసరాలు వేరు. శుక్రవారం మధ్యాహ్నం చార్మినార్‌ చూసేందుకు వచ్చిన యువతి సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. 

గుర్రానికి నాడాను మార్చిన అనంతరం దాని నీడలోనే ఈ యువకుడు సేద తీరుతూ కనిపించాడు. హయత్‌నగర్‌లోని తొర్రూరు రోడ్డులో శుక్రవారం ‘ఈనాడు’కు చిక్కిందీ చిత్రం 

కర్నూలు నగర శివార్లోని గార్గేయపురం సమీపంలో కర్రలపై నడుస్తూ వెళుతున్న భక్తులు పాదయాత్రగా శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళుతున్నారు.

 గురి కుదిరింది.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో విల్లులు సంధించిన పోటీదారులు.  

కదిరి: అలకబూనిన అమ్మవారిని.. శ్రీవారు బుజ్జగించే ఘట్టమే అలకోత్సవం. శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో 13వ రోజున శుక్రవారం అలకోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 

పలు ప్రాంతాల్లో శుక్రవారం  అర్ధరాత్రి భారీ వర్షం మొదలైంది. లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షంతో వాతావరణం చల్లబడింది.  

కడియపులంక పేరువినగానే ఠక్కున గుర్తుకొచ్చేది పచ్చని పూల మొక్కలు, ఆకట్టుకునే విరుల సిరులు.. అయితే, ఇప్పుడు యాలకుల దండలకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 

 కోరుకొండ: గూడెం కాదండోయ్‌.. వైద్యాలయం..! వెనుక వైపు పచ్చని చెట్లతో కొండ.. ముందు వరుసగా గుడిసెలు.. ఈ చిత్రాన్ని చూస్తే మన్యంలో ఏ గూడెమో అనుకుంటే పొరబడినట్లే. రోగులకు చికిత్స అందించే ఆయుర్వేద వైద్యశాలలు ఇవి.. 

పాడేరు పట్టణం: ఒకవైపు ఎండలు మండుతుంటే మన్యంలో పొగమంచు సోయగాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.  

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(11-04-2025)

Eenadu.net Home