చిత్రం చెప్పేవిశేషాలు
(23-12-2024)
హకీంపేట ఎన్ఐఎస్ఏ అకాడమీలో ఏర్పాటు చేసిన ‘రోజ్ గార్ మేళా’లో కేంద్రమంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
సంధ్యా సమయం, చుట్టూ పచ్చని కొండలు.. చల్లబడిన వాతావరణం.. ప్రశాంతంగా నీలి పాన్పులా ఉన్న రామప్ప సరస్సు
నిండుకుండలా పర్యాటకులను కనువిందు చేస్తోంది.
కూకట్‌పల్లిలోని అంజాద్ హబీబ్‌కు చెందిన సెలూన్ ప్రారంభోత్సవంలో సినీనటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రీడల్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్) పోటీలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం విజయవాడలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించారు. గుడువర్రు గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఆదివారం దిల్లీలో ఆకట్టుకుంటున్న టెడ్డీబేర్‌లతో తయారు చేసిన భారీ క్రిస్మస్ చెట్టు.