చిత్రం చెప్పే విశేషాలు
(24-01-2025)
గణతంత్ర దినోత్సవ సన్నాహక పరేడ్‌లో గురువారం ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటం వీక్షకులను ఆకట్టుకుంది. ఏటికొప్పాక బొమ్మలతో ముస్తాబైన శకటం దేశ రాజధాని దిల్లీలో రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని చాటింది.
జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు మంత్రి లోకేశ్‌కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చిలుక జోస్యం అందరికీ తెలుసు. కానీ, ఓ చిన్ని ఎలుక కూడా తమిళనాడులో జోస్యం చెబుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సిద్దిపేటలోని ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జంక్‌ఫుడ్ తీసుకుంటే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేలా ఫ్యాన్సీ డ్రెస్ ధరించి చిన్నారి చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది.
ఏదో విషయమై చర్చించుకునేందుకు తాబేళ్లన్నీ సమావేశమైనట్టు ఉంది కదూ ఈ చిత్రం. ఈ దృశ్యం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లోని కొలనులో గురువారం కన్పించింది.
చేతిరాతతోనూ రికార్డులు సాధించొచ్చని ఆదిత్య పాఠశాలల విద్యార్థులు నిరూపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జాతీయ చేతిరాత దినోత్సవం సందర్భంగా కాకినాడ జేఎన్‌టీయూకే ప్రాంగణంలో జరిగింది.
దేశభక్తి నలుగురికి తెలిసేలా.. ఇంటి గోడలకు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు వేయించారు హనుమకొండ జిల్లాలోని వెయ్యిస్తంభాల ఆలయం ఎదురుగా 10వ డివిజన్ ఉజిలిబేస్‌లో ఉండే మేహరాజ్.
రెండు రోజులుగా సిద్దిపేటను పొగమంచు కప్పేస్తోంది. ఉదయం 9 గంటలైనా వీడలేదు. దీంతో రహదారులపై వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు.
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా జగిత్యాల సాయిరాంనగర్‌లో పలువురు మహిళలు రంగవల్లులతో రాముని చిత్రాన్ని వేసి దీపాలంకరణ చేశారు.
కొత్తగూడెం రుద్రంపూర్ ఆఫీసర్స్ క్లబ్‌లో యోగాసన భంగిమల్లో తీర్చిదిద్దిన బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.