చిత్రం చెప్పే విశేషాలు
(24-03-2025)
కడియం: సహజంగా అరటి గెల చెట్టు నుంచి కిందికి వేలాడుతూ ఉంటుంది. థాయిలాండ్ దేశానికి చెందిన ఈ టోంగా అరటి రకం చెట్ల గెలలు ఇలా నిటారుగానే ఉంటాయి.
సాగర్‌నగర్ బీచ్‌లోని సంరక్షణ కేంద్రం నుంచి ఆదివారం సుమారు 160కి పైగా తాబేళ్ల పిల్లల్ని సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు.
ఈ చిత్రాల్లో కనిపిస్తున్నవి ఒకప్పటి ప్రాగటూరు రాజ్యపు కోటగోడలు, అందులోని నిర్మాణాలు.
అబ్బురపరిచే చిత్రాలు.. ఆనాటి కార్లు సందర్శకులను కట్టిపడేశాయి. కోకాపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘ఛారిటీ ఆర్ట్ షో అండ్ వింటేజ్ కార్ షోకేజ్’ ప్రదర్శన ఆకట్టుకుంది.
చిత్రంలో పొడవాటి తోకతో కనిపిస్తున్న ఈ పెద్ద ఉడత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు అటవీ ప్రాంతంలో ‘ఈనాడు’కు చిక్కింది.
ముదిగొండ: సాధారణంగా తులసి చెట్టు రెండు నుంచి మూడు అడుగుల వరకు మాత్రమే పెరుగుతుంది.
జగదల్‌పుర్ శివారులో ఉల్లాస్ నవభారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయిదో తరగతి పరీక్షలకు హాజరైన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వయోజనులు
కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయం వద్ద జస్టిస్ దుప్పల వెంకటరమణ (కుడి). చిత్రంలో ధీరజ్, డాక్టర్ రమణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియాలోని శరత్ అనే వ్యక్తి తన తల్లిపై ప్రేమను ఇలా వినూత్నంగా చాటుకున్నారు.
ఈదులపూపల్లి గ్రామం దర్గాతండాకు చెందిన హరిత ప్రేమికుడు భూక్యా అంజీ వేసవికాలం నేపథ్యంలో భానుడి నుంచి రక్షణకు ఆటో పైకప్పుపై పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.