#eenadu
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 30 మంది పర్యాటకులకు నివాళులర్పిస్తూ పెద్దాపూర్ గ్రామానికి చెందిన కవి, చిత్రకారుడు గుండు రమణయ్య గీసిన దాడుల ఊహా చిత్రం ఆలోచింపజేస్తోంది.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మలారెడ్డి దంపతుల కుమార్తె వివాహ నిశ్చితార్థం బుధవారం సంగారెడ్డిలో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.
‘కోర్టు’ సినిమా ఫేమ్ శ్రీదేవి బుధవారం నెల్లూరులో సందడి చేశారు. నగరానికి వచ్చిన ఆమెను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరాగా.. అంతే ఉత్సాహంతో వారితో మాట కలిపారు.
చింతపల్లిలో పలుచోట్ల సన్నాయి పూలు వివిధ రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి.
సూర్యాస్తమయ సమయంలో అస్తమయం జరిగినా ఎరుపెక్కిన అరుణ కిరణాలు కాంతిపుంజాలై ఆకాశంలో కనువిందు చేశాయి.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు.