చిత్రం చెప్పేవిశేషాలు
(24-12-2024)
భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. మూడో రోజు సోమవారం 90వేల మంది తరలివచ్చారు.
క్రిస్మస్ సందర్భంగా నగరంలోని పలు చర్చీలను విద్యుద్దీపాలతో అలంకరించారు. సికింద్రాబాద్ పరిధిలోని సెయింట్ మేరీస్, వెస్లీ, ఎస్పీజీ చర్చీలు మిరుమిట్లు గొలుపే నక్షత్ర కాంతుల్లో వెలుగులీనుతున్నాయి.
వరగలి అడ్డరోడ్డు జాతీయ రహదారి కూడలి నుంచి మండలంలోని వివిధ గ్రామాలను అనుసంధానిస్తూ నిర్మించిన ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది.
#eenadu
#eenadu
#eenadu
#eenadu
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేయగా విద్యార్థులు, యువత నినాదాలు, సాంస్కృతిక నృత్యాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల.. సహజసిద్ధంగా ఏర్పడిన దీన్ని 1972లో అభయారణ్యంగా గుర్తించారు. అందమైన, అరుదైన పక్షిసంపదకు నెలవు. తాగునీరు, తగినంత ఆహారం, అనువైన వాతావరణం ఉండడంతో కొత్త పక్షులు వస్తుంటాయి.