చిత్రం చెప్పే విశేషాలు

(25-01-2025)

వనపర్తి జిల్లా ఆత్మకూరులో సూర్యోదయం వేళ భానుడి కిరణాలు గుడిపై పడి వెలుగులీనుతూ నిశ్చలమైన నీటిలో ప్రతిబింబిస్తూ చూపరులకు కనువిందు చేస్తోంది. ఆ దృశ్యాన్ని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించింది.

పేట కేజీబీవీలో శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధనా సిబ్బంది, విద్యార్థులు.. బాలికలకు విద్యా ప్రాముఖ్యతపై వివిధ రకాల రంగులతో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏలూరులో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనాంశమిది. ఆడ పిల్లలపై వివక్షను రూపుమాపాలని చాటి చెప్పారు. 

ఒకే కుండీలో ఉన్న మొక్కకు ఐదు వందలకుపైగా చామంతులుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాంటి పూల మొక్కలు విశాఖలోని అక్కిరెడ్డిపాలెం వద్దనున్న ఓ నర్సరీలో ఆకట్టుకుంటున్నాయి.

రేవునగరిలో ఫల, పుష్ప ప్రదర్శనకు చక్కని స్పందన లభించింది. మొక్కలతో చేసిన ఎడ్ల మధ్య రైతు బొమ్మ.. పూలతో చేసిన ఈఫిల్‌ టవర్‌ .

ఈ చిత్రంలో గాల్లో మేఘాలు కదులుతున్నట్లు ఉంది కదూ.. కానీ అవి మేఘాలు కాదండోయ్‌.. దట్టమైన పొగమంచే. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోహెడ హనుమాన్‌ కొండపై కనిపించిన దృశ్యం. 

దేశ భవితను మార్చే శక్తి ఓటుకు ఉంది. నా ఒక్క ఓటు వేయకపోతే పోయేదేమీ లేదని చాలా మంది దూరంగా ఉంటున్నారు. సంతకవిటి మండలం సిరిపురం పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన. 

పొద్దు ఎప్పుడో పొడిచినా.. ఇంకా తెల్లవారలేదేమో.. అన్నట్లుగా శుక్రవారం ఉదయం పొగమంచు యాదగిరిగుట్టను కమ్మేసింది. తాము ఊటీలో ఉన్నామా.. అన్నంతగా పర్యాటకులు, భక్తులు ఆహ్లాదానికి గురయ్యారు. 

సముద్ర మట్టానికి వందల అడుగుల ఎత్తులో తొట్లకొండపై ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులను రారమ్మంటోంది. పిల్లలు పెద్దలు వాటి వద్ద చిత్రాలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.  

పుల్లంగి పంచాయతీ పరిధిలోని అందాలకు నెలవైన ‘గుడిస కొండ’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలకు భారీగా తరలివచ్చిన భక్తులు.

చిత్రం చెప్పే విశేషాలు(15-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(15-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(14-02-2025)

Eenadu.net Home