చిత్రం చెప్పే విశేషాలు
(25-02-2025)
దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ జట్టును అభినందిస్తూ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు.
శ్రీకాళహస్తి: సదాశివుని ఆత్మలింగాన్ని పొందిన భక్తాగ్రగణ్యుడు రావణుడు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని లంకేశ్వరుని శిరస్సుపై సోమస్కందమూర్తి కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.
నెల్లూరు శివారు పడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై సాయం సంధ్యావేళ సూర్యబింబం ఆకట్టుకుంది. వంతెన వద్ద వాహనంపై సూర్యుడు ప్రయాణిస్తున్నట్టు కనిపించిన ఈ దృశ్యాన్ని సోమవారం ‘ఈనాడు’ క్లిక్ మనిపించింది.
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘పార్వతి కల్యాణం’ కూచిపూడి యక్షగానంలో చక్కటి హావభావాలతో ఆకట్టుకున్న నృత్యాంశాలు
మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గుంటూరు జిల్లా పేరేచర్ల కైలాసగిరి క్షేత్రం ఉత్సవ కమిటీ 1,008 కిలోల లడ్డూ బూందీతో శివలింగాన్ని తయారు చేయించింది.
గుడ్లూరు: బండ్లమాంబ ఆశ్రమ పాఠశాలలో ముందస్తు సైన్స్ దినోత్సవం నిర్వహించారు. భారత్ ప్రయోగించిన వంద రాకెట్ నమూనాలను ప్రదర్శించారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏ వీధి చూసినా జనంతో కిటకిటలాడుతోంది. గదులు లభించక జనం ఆరబయట స్థలాల్లోనే నిద్రపోతున్నారు.
గువాహటి: ఝూముర్ బినందిని అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అతిపెద్ద ఝూముర్ నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టిస్తోందని మోదీ అన్నారు.
శివరాత్రిని పురస్కరించుకుని విద్యుత్తు వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతున్న యనమలకుదురు రామలింగేశ్వరస్వామి దేవాలయం.
వినియోగదారులను ఆకర్షించేందుకు నిర్వాహకులు భిన్న రీతుల్లో ఆలోచిస్తున్నారు. మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు ఓ ఆయిల్ కంపెనీకి చెందిన ఇనుప డ్రమ్ములను కొనుగోలు చేసి రెండు భాగాలుగా కత్తిరించారు.
అనకాపల్లి : పెన్సిల్ చెక్కి దాంతో బొమ్మలు గీస్తారు చాలా మంది. కానీ, మహాశివరాత్రిని పురస్కరించుకొని తాండవం చేస్తున్న శివుడి రూపాన్ని పెన్సిల్ మొనపై చెక్కారు.
విశాఖలో వీఎంఆర్‌డీఏ ఉద్యానవనంలో ఇటీవల ఏర్పాటు చేసిన బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో రకరకాల రంగుల్లో ఉండే పీతలు సోమవారం చిక్కాయి. నీలం, నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పీతలు లభ్యం కావడంతో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.