చిత్రం చెప్పే విశేషాలు
(25-03-2025)
గువాహటిలో జరిగిన మిస్ సరైఘాట్ పోటీల్లో విజేతగా నిలిచిన అనంతరం నిర్వాహకులు బహూకరించిన ట్రోఫీతో బర్నాలీ బసుమతారీ
రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకాల్లో ఒకటైన షీర్‌కుర్మా కోసం సేమియాలు సిద్ధమవుతున్నాయి. చాదర్‌ఘాట్ వద్ద ఓ మహిళ సంప్రదాయ సేమియాను తయారు చేసి ఆరబెడుతున్న దృశ్యమిది.
కార్వాన్- అత్తాపూర్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 102 వద్ద కూడలిలో ఏర్పాటు చేసిన కళాఖండాలు ఆకట్టుకుంటున్నాయి.
హొసపేటె: విరూపాక్షేశ్వర-పంపాంబికె అమ్మవారి వేడుకలకు సంబంధించి హంపీలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వాడచీపురుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి కనకఅప్పారావు అన్నారు. ఈఎన్‌డీ టీబీ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన చేపట్టారు.
ఒకటే చెట్టు.. ఐదింతల దిగుబడి.. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టుపల్లి గ్రామంలో ఓ రైతు పెరట్లో పెరిగిన బొప్పాయి చెట్టు అందరినీ ఆకర్షిస్తోంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కిందపడిపోయిన సెగ్మెంటల్ లాంచింగ్ గాంట్రీ
ఒడ్డుకు బోటు.. ఉపాధిపై వేటు..వైజాగ్ కాలనీ సమీపంలో కృష్ణా వెనుక జలాల వద్ద ఒడ్డుకు చేరిన బోట్ల చిత్రమిది.