#eenadu

రాజానగరం: కశ్మీర్‌ మృతులకు కన్నీటి వీడ్కోలు.. క్రీడాప్రాంగణంలో విద్యార్థులందరూ కొవ్వొత్తులు పట్టుకుని భారతదేశం ఆకారంలో ప్రదర్శన ఇచ్చారు. 

హుస్సేన్‌సాగర్‌ తీరంలో లేజర్‌ లైట్‌ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. వేసవి సెలవులు కావడంతో గురువారం సాయంత్రం చిన్నా పెద్దా సాగర తీరానికి తరలివచ్చారు. లేజర్‌ షో వీక్షిస్తూ సందడి చేశారు. 

ఏయూ ప్రాంగణం: ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థుల ఫ్లాష్‌మాబ్‌ అలరించింది. 

పొడవైన దేవదారు, పైన్‌ చెట్ల మీదుగా నిటారుగా ఉన్న కొండప్రాంతం ఎక్కి పైకి వెళితే.. చుట్టూ మంచు కప్పిన పర్వతాలతో విశాలమైన పచ్చికబయలు.. అదే ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పిలిచే బైసరన్‌.

నాసాకు చెందిన హబుల్‌ టెలిస్కోప్‌ తాజాగా తీసిన అంతరిక్ష చిత్రాలివి. ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటుచేసి 35 ఏళ్లు అయిన సందర్భంగా నాసా వీటిని విడుదల చేసింది.  

విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణకు అటవీ శాఖ ఆధ్యర్యంలో కంబాల కొండలో వందలాది మొక్కలు నాటారు.

కాజీపేట వద్ద కడిపికొండ వంతెనపై ఇరువైపులా వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్‌లో గురువారం గొండోలా కేబుల్‌ కార్‌ స్టేషన్‌ వద్ద పర్యాటకుల సందడి

జమ్మూ-కశ్మీర్‌ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో పర్యాటకులు లేక షికారాలు ఇలా ఖాళీగా దర్శనమిచ్చాయి. 

ఏటా అన్నదాతలు ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోడ్లపై ఆరబోస్తున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(26-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(26-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(25-04-2025)

Eenadu.net Home