చిత్రం చెప్పే విశేషాలు
(26-02-2025)
యాంగ్సీ నది పక్కన ఉన్న ఓ పర్వతం నేలపై కూర్చున్న శునకం తల ఆకారంలో ఇలా కనిపించగానే ఆయన తన కెమెరాలో బంధించారు.
అమలాపురం రవణంవీధిలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అద్దాలతో అనంతంగా ప్రతిబింబిస్తున్న ఒకే శివలింగమిది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ఏర్పాటుచేశారు.
9 అంతస్తులు.. 9 మంది సిద్ధులు.. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవనాథుల స్తూపం ముస్తాబైంది.
విజయవాడ సమీపంలోని యనమలకుదురు రామలింగేశ్వరస్వామి సన్నిధిని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.
తిరుపతి ఐఐటీ ప్రాంగణాన్ని 550 ఎకరాల్లో శాశ్వత భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ యూజీ, పీజీ విద్యార్థులు 2000 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎటు చూసినా పచ్చదనం సంతరించుకుని కనువిందు చేస్తోంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బంగారు విమాన గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ముగిశాయి. విద్యుత్తు దీపాలతో ఆలయం ఇలా కాంతులీనుతోంది.
ఒడిశాలోని కేంద్రపడ జిల్లా పరిధిలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి 12 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చాయి.
ఆర్మూర్ డివిజన్‌లో ఏ రోడ్డుపై చూసినా ఇలా ఆరబోసిన ఎర్రజొన్నలే కనిపిస్తున్నాయి. ఆర్మూర్ నుంచి నందిపేట్ వెళ్లే దారిలో సుమారు 2 కి.మీ. మేర కనిపించిన దృశ్యమిది.
పానగల్‌లోని ఛాయాసోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయాలను విద్యుత్తు కాంతులతో అలంకరించారు.