చిత్రం చెప్పే విశేషాలు
(26-03-2025)
జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ ఆలయ వార్షిక జాతర, ఉగాది మహోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
కోరంగి పంచాయతీ పరిధిహోప్ ఐలాండ్‌లోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో తాబేళ్ల పిల్లలు సందడి చేశాయి.
కూడళ్ల సుందరీకరణలో భాగంగా తెలుగు తల్లి పైవంతెన కింద ఏర్పాటు చేసిన పాలపిట్ట బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. రెండూ ముచ్చట్లాడుతూ ముచ్చట గొలుపుతున్నాయి.
మహారాష్ట్రలోని ఠాణెలో నూతనంగా ప్రారంభించిన పోలీస్‌స్టేషన్ వాహనం ఇది. ఠాణెలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ ఇంటి వద్దే ఫిర్యాదులు సమర్పించేందుకు ఈ వాహనం వీలు కల్పిస్తుంది.
ఏలూరు: గోడ వెనుక చెట్టు.. బయట చిత్రం.. చూసేవారికి ప్రహరీ నుంచి వచ్చిన వృక్షంలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
పొలం మధ్యలో ఇల్లు.. చుట్టూ ప్రహరీ మాదిరి చేపట్టిన నిర్మాణం.. చూడగానే భలే ఉంది అనిపిస్తుంది కదూ..! కానీ ఇది మొక్కజొన్న కంకులతో కట్టింది అంటే నమ్మగలరా?ఉప్పరపల్లి ప్రధాన రోడ్డులో ఓ రైతు పొలంలో ఇది ఆవిష్కృతమైంది.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పల్వంచకు చెందిన బేతయ్య తన ఆటోపై గోనె సంచులు బిగించి కట్టారు. వాటిపై తరచుగా నీళ్లు చల్లితే ఎక్కువ సమయం లోపల చల్లగా.. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
అమరావతి-అనంతపురం జాతీయ రహదారి కలిసే పుట్టావారిపాలెం కూడలిలో మంగళవారం ఉషోదయాన ప్రసరిస్తున్న కిరణ్మయం సహజ అరుణవర్ణ చిత్రమిది.