చిత్రం చెప్పేవిశేషాలు

(26-12-2024)

అనకాపల్లి పట్టణం గాంధీనగరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుడు బుధవారం నరసింహ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఏ గూడూ లేక విశాఖ నగరంలో రోడ్లపై నిద్రించే అభాగ్యులు చలి తీవ్రతకు గజగజ లాడిపోతున్నారు. వారి బాధలు చూసి చలించిన కొందరు స్పందించి తమదైన రీతిలో సాయం చేస్తున్నారు. 

ఎర్రటి ముక్కు పసుపు వర్ణం కలిగిన శరీర సౌష్టవంతో చూపరులను తమవైపు తిప్పుకునే కొల్లేరు అందాల విహంగం ఇండియన్‌ గోల్డెన్‌ ఓరియోల్‌.కొల్లేరువాసులు ఈ పక్షిని ముద్దుగా వంగ పండు అని పిలుచుకుంటారు. 

పట్టణానికి సమీపంలోని బేరుపల్లెచెరువు వద్ద విద్యుత్తు హైటెన్షన్‌ టవర్లకు పచ్చటి తీగలు అల్లుకుని పైకి ఎగపాకుతున్నాయి. టవర్‌ నుంచి విద్యుత్తు తీగలకు తగిలితే ప్రమాదమని ప్రజలు భయపడుతున్నారు.  

మెదక్‌ కేథడ్రల్‌ చర్చిలో క్రిస్మస్‌ సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. మంగళవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. బుధవారం భక్తుల రాకతో కోలాహలం నెలకొంది. 

గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో పచ్చదనం అందాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.పూర్తిగా పచ్చదనంతో ఉన్న వాతావరణం ప్రకృతి శోభాయమానంగా విరాజిల్లుతోంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బలమైన అలలు వచ్చి మండలంలో సముద్రతీరం కోతకు గురైంది. గుచ్చకాయలపోరలో సుమారు 200 మీటర్ల మేర తీరంలో ఇసుకమేటలు కోతకు గురయ్యాయి.

అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్నా.. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో బుధవారం డుడుమ జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. విశాఖ, విజయనగరం, జయపురం, మల్కాన్‌గిరి, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. 

బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ను బుధవారం మంచు కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు కురవడంతో పాటు చిరు జల్లులు పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. 

నాచుగుంటలో సుమారు పదెకరాల్లో రూ.9 కోట్లతో ఏర్పాటు చేసిన సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకం (సీపీడబ్ల్యూఎస్‌) నిరుపయోగంగా ఉంది. చెరువులో నీరున్నా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. 

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-01-2025)

Eenadu.net Home